Friday, April 8, 2011
అందమైన అందం....
ఈ ప్రపంచం లో అందం అనేది నాలుగు తీర్లు అని చెప్పొచు #1 ప్రాపంచిక అందం....అంటే ప్రపంచం అంతా ఆరాదించే అందం, శారీరక అందం. అమ్మాయి లో అందం లేదా అబ్బాయి లో అందం. ఒక అమ్మాయి లేదా అబ్బాయి ఎలా ఉన్నారు లేదా ఎలా కనిపిస్తున్నారని ఇతరులు ఆలోచించేది #2 అందమైన ప్రపంచం....భగవంతుడి శ్రుష్టి ఎంతో అందమైనది, ప్రకుతి అందాలూ చాల ఆహ్లాదకరమైనవి అని అందరు ఆలోచించేది ఈ రెండు చాలాప్రాపంచిక అందాలని నా ఆలోచన మిగితా రెండు రకాల అందాలూ ఆధ్యాత్మికమైన అందాలూ.... #3 మనస్సు.....చాలా తక్కువగా ఆరదిన్చబడే అందం. #4 భగవంతున్ని ఆరాదించడం లో ఉన్న "అందమైన ఆనందం".....ఇది చాలా అరుదుగా ఆస్వాదిన్చాబడే అందం. కాని ఈ అందం ఇచ్చే సంతోషం అనిర్వచనీయం. ఇది తెలుసుకున్న ప్రతి మనిషి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు. మొదటి రెండు అందాలు అందరూ చూడగాల్గేవి అందరూ కోరుకునేవి కాని విచిత్రం ఏమిటంటే ఎవరైతే మొదటి రెండు అందాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారో వాళ్ళు మిగితా రెండు అందాలని చాలా కోల్పోతుంటారు అంతే కాదు వాళ్ళు జీవితం లో ఏనాడూ సుఖంగా ఉండలేరు...ఒకవేళ ఉన్నా అది కేవలం క్షణికమే లేదా అశాశ్వతమే.....అదే మనిషి ఎప్పుడైతే తరువాతి రెండు ముఖ్యమని గమనిస్తాడో వాడు జీవితం లో శాశ్వత సుఖాన్ని సంతోషాన్ని తప్పక పొందుతాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment